జననేతకు పేరొస్తుందనే భయం..!

గుంటూరుః ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే జననేతకు పేరొస్తుందనే చంద్రబాబు దీక్షను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం మంచిది కాదని హితవు పలికారు. ఢిల్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.

గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రజాఉద్యమాన్నిఅణచివేయాలని చూస్తే సహించేదిలేదని లేళ్ల స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా వస్తే భావి తరాలకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.పోలీసులు కూడా న్యాయాన్యాయల గురించి తెలుసుకొని వ్యవహరిస్తే మంచిదన్నారు.
Back to Top