అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ బాసట

 
విజయవాడ:  అగ్రి గోల్డు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ బాసటగా ఉందని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అగ్రి గోల్డు బాధితులు ఎవరూ కూడా బలవన్మరణాలు పొందకూడదని, అగ్రిగోల్డు బాధితులకు భరోసా కల్పించేందుకు 11 మందితో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కమిటీని నియమించారని, రేపు విజయవాడలో బాధితుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కుంభకోణం బయటకు వచ్చాక అగ్నిగోల్డు బాధితుల తరఫున వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటం చేశారని ఆయన చెప్పారు. అగ్రిగోల్డు యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
 
Back to Top