నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి

  • అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా
  • బిల్డింగ్ లు పడగొట్టడం అభివృద్ధి కాదు
  • మూడున్నరేళ్లుగా బాబుకు నంద్యాల కనబడలేదు
  • ఎన్నికరాగానే వందలకోట్ల అవినీతి సొమ్ముతో కొనుగోళ్లు చేస్తున్నాడు
  • దెయ్యాలకు ఓటు వేయాల్సిన పని లేదు
  • లౌక్యంతో వ్యవహరించి ధర్మంవైపు నిలబడండి
  • ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించండి
  • గోస్పాడులో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం
కర్నూలు(గోస్పాడు)చంద్రబాబు వందల కోట్ల అవినీతి సొమ్ముతో నంద్యాలకు వచ్చి చిన్నా చితకా లీటర్ల మొదలు అందరినీ కొనుగోలు చేస్తున్నాడని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు. మూడున్నరేళ్లలో ఏనాడు నంద్యాల ముఖం చూడని బాబు, మంత్రులు... ఉపఎన్నిక రాగానే నంద్యాల నడిరోడ్ల మీద తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. గోస్పాడు మండలంలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే....నంద్యాలలో ఉపఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో అందరకీ తెలిసే ఉంటుంది. మూడున్నరేళ్లలో ఎప్పుడూ లేని హడావిడి నంద్యాలలో ఇప్పుడు కనిపిస్తుంది. చంద్రబాబు, మంత్రులు ఒక్కరోజైనా నంద్యాలకు వచ్చారా..? నంద్యాల నడిరోడ్ల మీద తిరుగుతూ కనిపించారా..? ఇవాళ ఎన్నిక రాగానే బాబు క్యాబినెట్ అంతా నంద్యాల నడిరోడ్లపై కనిపిస్తోంది. బాబు హడావిడిగా బెంబేలెత్తిపోయి జీవోల మీద జీవోలిస్తున్నాడు. మూడున్నరేళ్లుగా బాబుకు నంద్యాల కనబడలేదు. 

నంద్యాల ఉపఎన్నిక వచ్చింది కాబట్టి వైయస్సార్సీపీ పోటీ పెట్టింది కాబట్టే బాబు, మంత్రులు నడిరోడ్లపై కనిపిస్తున్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఎరవేస్తా ఉన్నారు. అర్థరాత్రి పోలీసులను పంపి బెదరగొడుతున్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోంది. బాబు అనే వ్యక్తి ఒక్క మాట కూడ నెరవేర్చని కారణంగా మూడున్నరేళ్లలో ఏ ఒక్కరికీ న్యాయం చేయని కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. బాబు అవినీతి చేశాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఎన్నికలప్పుడు గెలవడం కోసం రైతులకు చంద్రబాబు ఏం చెప్పాడని అడుగుతున్నా. ఎన్నికల్లో గెలవడం కోసం గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఏ గోడల మీద చూసినా బాబు ఫ్లెక్సీలు కనిపిచేవి. టీవీల్లో అడ్వర్టైజ్ మెంట్ వినిపించేవి. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా, రైతుల రుణాలు మాఫీ కావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. బ్యాంకుల్లోని బంగారం ఇంటికి తిరిగి రాలేదు. ధరల స్థిరీకరణ నిధీ లేదు. రుణాలు మాఫీ కాలేదు.   మిర్చీ, పసుపు, శనగ, మినుముకు ధర లేదు. రోడ్డు మీద వేసి కాల్చుతున్న పరిస్థితి.  గుండ్రేవుల ప్రాజెక్ట్ కడతానన్నావ్. అది కట్టలేదు. ఎన్నికలప్పుడు ఇచ్చింది ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చిన దాఖలాలు లేవు.  ఇంతకుముందు సన్నావడ్డీకి డబ్బువచ్చేది. అది కూడ పోయి బాబు పుణ్యమాని బ్యాంకుల గడప తొక్కలేకుండా ఉన్నారు.  ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న పిల్లలను వదల్లేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఉద్యోగం లేకపోతే ఇంటికి రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నడు. 38 నెలలయింది. ప్రతి ఇంటికి బాబు రు. 76 వేలు బాకీ పడ్డడు. ఏ ఒక్కరికీ ఇవ్వలేదు.

పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలు, రైతులు, చదువుకున్న పిల్లలను మోసం చేశాడు. అదీ చాలదన్నట్టు పేదవాళ్లపై కన్నుపడింది. ఇళ్లులేని పేదవాళ్ల జీవితాలతో  చెలగాటమాడాడు. ప్రతి పేదవాడికి 3సెంట్ల స్థలమన్నాడు. ఇళ్లు అన్నాడు. ఏమీ చేయలేదు. ఎన్నికలప్పుడేమో మోసపూరిత వాగ్ధానాలిచ్చాడు. ఆతర్వాత అందరినీ వెన్నుపోటు పొడిచాడు. కర్నూలుకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచాడు.  నంద్యాల ఉపఎన్నిక అనేసరికి మళ్లీ వచ్చాడు. ఎన్నికలుంటేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తరు కాబట్టి అదే అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలు. ఇలాంటి మోసం చేసే బాబును ఏమనాలి..? వదిలేద్దామా..? రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట తప్పితే కాలర్ పట్టుకొని నిలదీసే పరిస్థితి రావాలి.  మీరేసే ఓటు ద్వారా వ్యవస్థలో మార్పుకు నాంది పలకాలి. బాబు మోసాల మీద, అధర్మ పాలన మీద ఓటు వేస్తా ఉన్నాం. జగన్ బహుషా వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇవాళ మీరు వేసే ఓటు మార్పుకు నాంది పలుకుతుంది. నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి. పులివెందుల మాదిరి నంద్యాలను అభివృద్ధి చేస్తా.  నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీ కెనాల్ లో రెండు పంటలు పండే పరిస్థితి ఉండేది. ఇవాళ ఒక్క పంటకు కూడ నీళ్లు వస్తాయో రాదో నని రైతులు భయపడుతున్నారు. నాది బాధ్యత. అభివృద్ది అంటే ఏంటో నేను చూపిస్తా. ప్రతి పేదవాడు, రైతుల ముఖంలోచిరునవ్వు చూడాలి. నంద్యాలలో రెండు మూడు కి.మీ.  బిల్డింగ్ లు కొట్టేసి బాబు అబివృద్ధి అని మాట్లాడుతున్నాడు. పట్టణాలు పెరుగుతున్నప్పుడు బిల్డింగ్ లు పగలగొడితే అదే అభివృద్ధి అనుకుంటే అంతకన్నా మోసం ఇంకోటి ఉండదు. వారిని సంప్రదించి పరిహారం అందించాలి. కడుపు కొట్టకూడదు. డబ్బుల మూటలతో బాబు వస్తాడు.  లౌక్యంగా వ్యవహరించి ధర్మం వైపు నిలబడండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించండి అని వైయస్ జగన్ 
గోస్పాడు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 
Back to Top