వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌ప్ర‌కాశం:  ప్రకాశం జిల్లా గుండెకాయ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని వారం రోజుల క్రితం పాదయాత్ర చేపట్టిన వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా పాద‌యాత్ర‌కు జిల్లా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. అలాగే పార్టీ నాయ‌కులు కూడా అధిక సంఖ్య‌లో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో వైవీ సుబ్బా రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగ నాగార్జున‌, ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కాకర్ల వద్ద ఏర్పాటు చేసిన రైతు స‌మ్మేళ‌నంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అసైన్డ్‌ భూముల పేరుతో రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వైయ‌స్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాల ప్రజా సమస్యలు ముందుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  
Back to Top