ప్రతీ గడపకు వెళ్లండిః వైయస్ జగన్

విజయవాడః నాయకులు కావాలంటే తండ్రులో.. తాతలో ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు చేరువైతే నాయకుడిగా నిరూపించుకున్నట్లేనని స్పష్టం చేశారు.  నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికీ వెళ్లాలని ఎమ్మెల్యేలకు, కో ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. 'గడప గడపకూ వైయస్ఆర్' అనే ఈ కార్యక్రమాన్ని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు.

Back to Top