వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌ల వెల్లువ‌

విశాఖ‌:  విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కొన‌సాగుతోంది. 242రోజు  జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఆయ‌నను క‌లిసేందుకు వేలాది మంది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ప్ర‌జ‌ల కోసం వైయ‌స్ జ‌గ‌న్ ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి నాయ‌కులు, మాజీ అధికారులు పార్టీలో చేరుతున్నారు. మాజీ రీటైర్డ్ ఎస్పీ ప్రేమ్‌బాబు, టీడీపీ నాయ‌కులు  గెడ్డ‌మూరి ర‌మ‌ణ‌, మున‌గ‌డ చిరంజీవితో పాటు  200 మంది కార్య‌క‌ర్త‌లు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరారు.  కైలాస‌ప‌ట్నం శివారు నుంచి ప్రారంభ‌మ‌యిన పాద‌యాత్ర  దార్ల‌పూడి వ‌రుకు సాగ‌నుంది. వైయ‌స్ జ‌గ‌న్‌పై ఉన్న అభిమానంతో కొంద‌రు  పాట‌లు రూపొందించి ఆల‌పించారు. 
Back to Top