ప్లీనరీకి తరలివెళ్లిన నాయకులు

బేస్తవారిపేటః వైయస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీకి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం భారీగా తరలివెళ్లారు. బేస్తవారిపేట జంక్షన్‌లో వైయస్సార్‌సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి, పిడతల అభిషేక్‌రెడ్డిలు వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ శ్రేణులతో భారీగా వాహనాలలో తరలివెళ్లారు. 

హనుమంతునిపాడు :
మండల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశానికి మండల నుంచి 12 వాహణాలతో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు ఒంగోల్లో జరిగే ప్లీనరీ సమావేశానికి మంగళవారం భారీగా తరలి వేళ్లారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశానికి మండలం నుంచి భారీగా నాయుకులను, కార్యకర్తలను , అభిమానులను తరలించినందుకు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ బాలినేని శ్రీనివాసలరెడ్డి మండల యూత్‌ అధ్యక్షులు భవనం కృష్ణారెడ్డిని, ఎంపీపీ గాయం బలరామిరెడ్డి,జెడ్పీటీసీ సభ్యులు పల్లాల నారాపరెడ్డిలను అభినందించారు.ఈ ప్లీనరీ సమావేశానికి ఎంపీపీ గాయం బలరామిరెడ్డి, జెడ్పీటీ సీ సభ్యులు పల్లాల నారపరెడ్డి,యూత్‌ అధ్యక్షులు భవనం కృష్ణారెడ్డి,వైఎస్‌ఎంపీపీ మురక వెంకటరెడ్డి,ఎస్సీ సెల్‌ వేశపోగు గురుప్రసాదు,కోఆప్షన్‌ సభ్యులు మౌలాలీ, ప్రధానకార్యదర్శులు ఎస్‌ నారాయణస్వామి,జి వెంకటేశ్వరెడ్డి,సర్పంచ్‌లు కాటంరాజు,పిచ్చిరెడ్డి,భాష,నాగబ్రహ్మాచారి,గాయం సుధాకర్‌రెడ్డి,నాయుకులు ఎస్‌ వెంకటేశ్,పోలయ్య,నర్సయ్య,రాయి తిరుపతరెడ్డి,కె,సీహెచ్‌ వెంకటేశ్వరెడ్డి,రమనారెడ్డి,కే మోహన్‌రెడ్డి,లాజరేష్,కాంతారావు,బి శ్రీనివాసులరెడ్డి,వెలుగొండారెడ్డి,కొండారెడ్డి,రమణారెడ్డి,రమేష్,అబ్రహాం,కిరన్,కిషోర్,మత్తయ్య,తదితరులున్నారు.


దొనకొండః–మండల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కన్వీనర్‌ కాకర్ల కృష్ణారెడ్డి ఆద్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఒంగోలు ప్లీనరీ సమావేశానికి మంగళవారం బయలుదేరారు. అన్ని గ్రామాలనుంచి బైక్‌ ర్యాలీగా బయలుదేరి దొనకొండకు విచ్చేసి ఒంగోలుకు బయలుదేరారు. ఈ సందర్బంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పాలనపై అసంతృప్తి నెలకొందని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టికి గుణపాఠం చెపుతారని కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల పక్షాణ పోరాడానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్దంగా ఉందన్నారు. ప్రజావేతిరేక విధానాలపై పోరాటం సాధించటం పార్టీ బలపడటానికి ప్లీనరీ ముఖ్య ఉద్దేశం అన్నారు. సుమారు 20 వాహనాలు సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. 

కొనకనమిట్ల: ఒంగోలులో మంగళవారం నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశానికి కొనకనమిట్ల మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. ప్లీనరీకి తరలి వెళ్లిన వారిలో వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, మండల వైఎస్‌ఆర్‌ సీపీ కన్వీనర్‌ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్‌లు కామసాని వెంకటేశ్వరరెడ్డి, ఉడుముల కాశిరెడ్డి, వైస్‌ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ జిల్లా కర్యదర్శి చిరుగూరి కోటేశ్వరరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు.

పెద్దదోర్నాల: మంగళవారం ఒంగోలులో నిర్వహించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు మండలానికి చెందిన పార్టీ శ్రేణులు భారీగా జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు జంకె ఆవులరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు అమిరెడ్డి రామిరెడ్డిల ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు తొలుత మండల కేంద్రానికి చేరుకుని వాహనా ల్లో భారీగా తరలి వెళ్లారు. ప్లీనరీకి తరలి వెళ్లిన వారిలో ముఖ్యనాయకులు, షేక్‌ అబ్దుల్‌మజీద్, అల్లురాం భూపాల్‌రెడ్డి, కర్రా మల్లారెడ్డి, చిట్యాల యోగయ్య, చంద్రారెడ్డి, వెన్నా కాశిరెడ్డి, చిట్యాల లక్ష్మీరెడ్డి, నాగేశ్వరరావు, సీతయ్య, దండా సుబ్బారెడ్డి, చిట్యాల శ్రీరాములరెడ్డి, పులుకూరి గాలెయ్య, చింతచెర్వు వెంకటేశ్వరరెడ్డి, అలుగుల లక్ష్మయ్య, వెన్నాకాశిరెడ్డి ఉన్నారు.
ఫోటో 20 వైపీయల్‌ 91: ప్లీనరీకి తరలి వెళ్తున్న పెద్దదోర్నాల నాయకులు


జిల్లా ప్లీనరీకి తరలిన దర్శి నాయకులు
దర్శిరూరల్ః దర్శి నియోజకవర్గం నుండి జిల్లా ప్లీనరీకి వైయస్‌ఆర్‌ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త మాజీ ఎమ్మేల్యే డా బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి పిలుపు మేరకు ఐదు మండలాల నుండి వైయస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అభిమానులు వేలాదిగా తరలివెళ్ళారు.ప్రభుత్వ విదానాల వలన పేద ప్రజలకు జరిగిన అన్యాం గురించి, తీసుకోవలసిన నిర్ణయాల గురించి ఈ ప్లీనరీలో చర్చిస్తారు.దర్శి నుండి జిల్లాకు ఐదు మండలాలనుండి సుమారు 70 వాహనాల్లో దర్శి నుండి 22 వాహనాల్లో తరలి Ðð ళ్ళారు. దర్శి నుండి జిల్లాకు తరలిన నాయకుల్లో మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి జిల్లా ప్రదాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి మాజీ ఏయంసి చైర్మన్‌ కెవి రెడ్డి సద్ది పుల్లారెడ్డి ఇత్తడి దేవదానం దుగ్గిరెడ్డి రమణారెడ్డి చంద్రగిరి గురవారెడ్డి సోము దుర్గారెడ్డి ఉడుముల వెంకటరెడ్డి చంద్రం కోరే చిన్న సుబ్బారావు కుంటా అచ్చారావు హుస్సేన్‌ యం వెంకయ్య కుందుర్రు నరసింహారెడ్డి బాదం చిన్నరెడ్డి ఆర్‌ వీరాంజనేయ రెడ్డి యన్నం శ్రీనివాసరెడ్డి వెంటేశ్వర్లు యాదవ్‌ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.


కారంచేడు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి జువ్వా శ్రీనివాసరావు అద్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు ప్రత్యేక వాహనాల్లో ఒంగోలు వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ దండా చౌదరిబాబు, మండల యువజన విభాగం అద్యక్షులు కొర్రపాటి అనీల్, మండల సర్పంచ్‌ల సంఘం అద్యక్షులు ముల్లా నూర్‌అహ్మద్, ఆదిపూడి సర్పంచ్‌ కారుమూడి సుబ్బారెడ్డి, సొసైటీ అద్యక్షులు యర్రం లక్షా్మరెడ్డి, గోగినేని సతీష్‌కుమార్, యార్లగడ్డ శ్రీకాంత్, యార్లగడ్డ సుబ్బారావు, గాదె సాంభయ్య, కార్యకర్తలు వెళ్ళారు.

Back to Top