పాదయాత్ర ప్రతిపక్ష నేత బాధ్యత

  • మీరు ఎవరిని అడిగి పాదయాత్ర చేశారు బాబూ..?
  • యాత్రలో విధ్వంసాలు సృష్టించేలా చంద్రబాబు వ్యాఖ్యలు
  • పన్నులు విపరీతంగా పెంచారు.. ప్రజలకు కావాల్సింది ఒక్కటైనా చేశారా..?
  • నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అప్పులు రూ.1.18 లక్ష కోట్లు
  • ఆ డబ్బంతా విదేశాల్లో జల్సాలు చేసేందుకు వినియోగం
  • ఇండస్ట్రీయల్‌ డౌలప్‌మెంట్‌ పాలసీ సర్వేలో ఏపీ స్థానం ఎంతో తెలుసా?
  • రహస్యంగా వేల జీవోలను ఎందుకు విడుదల చేశారో చెప్పగలరా..?
  • ప్రజా సంకల్పం ప్రశాంతంగా జరగాలని రేపు తిరుమలకు వైయస్‌ జగన్‌ 
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తించడానికి  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు చేస్తున్న ప్రయత్నమే ప్రజా సంకల్పం అని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్రకు ఆటంకాలు సృష్టించాలని చంద్రబాబు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు మహాత్మగాంధీ కూడా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అదే విధంగా దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి, అంతేగాక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాదయాత్రలు చేశారన్నారు. మీరు ఎవరి పర్మిషన్‌ తీసుకొని పాదయాత్ర చేశారు చంద్రబాబూ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు పాదయాత్రలు చేపడతారని చెప్పారు. వైయస్‌ షర్మిల కూడా పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రకు పర్మిషన్‌ అనేక అంశం ఇప్పుడు ఎందుకు వచ్చిందని, ప్రజా సంకల్ప యాత్రను క్రిమినల్‌ యాక్ట్‌ విటీగా చూపించే అవసరం మీకు ఎందుకు వచ్చిందని చంద్రబాబును నిలదీశారు. ప్రజాస్వామ్యంలో మితిమీరిన వ్యవహారాలు టీడీపీ చేస్తుందని ధ్వజమెత్తారు. 

సుమారు 1.5 కోట్ల జనాభాతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ధర్మాన వివరించారు. విద్యుత్, బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులు మూడు సార్లు పెంచారన్నారు. ఇంటి పన్నులు భారీగా పెంచారని, ఇంధన ధరలపై ఏ రాష్ట్రంలో లేనంతగా రూ. 4 ఎక్కవుగా తీసుకుంటున్నారన్నారు. పౌరులకు ఇస్తున్న సరుకుల్లో ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజలను ఎడాపెడా దోచుకుంటున్న ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సింది ఏమిచ్చిందని ప్రశ్నించారు. 4 సంవత్సరాలు కావొస్తున్నా రాజధాని నిర్మాణం జరగలేదు. ఉద్యోగాలు లేవు.. ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. పైగా రాష్ట్రాన్ని అప్పులమయంగా తయారు చేశారని మండిపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రూ.1.18 వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారని, మొత్తం కలిపి రాష్ట్ర అప్పు రూ.2.15 వేల కోట్లు ఉందన్నారు. తెచ్చిన అప్పులను ప్రజలకు ఉపయోగించకుండా చంద్రబాబు ఆయన కోటరీ విదేశాలు తిరగడానికి ఉపయోగిస్తున్నారన్నారు.
 
ఇండస్ట్రీయల్‌ పాలసీ డౌలప్‌మెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ చేసిన సర్వేలో ఏపీ స్థానంతో ఎంతో తెలుసా చంద్రబాబు అని ధర్మాన ప్రశ్నించారు. తెలంగాణ నెంబర్‌. 1 స్థానంలో ఉంటే ఏపీ 15వ స్థానంలో నిలిచిందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ 21 మంది శాసనసభ్యులను టీడీపీలో చేర్చుకొని వారిలో నలుగురిని మంత్రులను చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్‌ మైక్‌ ఇవ్వరు. ప్రతిపక్షం మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలిసిపోతాయోనని తెలుగుదేశం సర్కార్‌ నిరంతరం భయంతో బతుకుతుందన్నారు. స్పీకర్‌ రాజ్యాంగానికి అనుగూనంగా ప్రవర్తించకపోతే.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు.. వారికి భరోసా ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, చట్ట వ్యతిరేక విధానాలను, ప్రజాస్వామ్య విఘాతాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైయస్‌ జగన్‌పై ఉందన్నారు. 

పాదయాత్రకు ఎవరిని అడిగి మీరు పర్మిషన్‌ తీసుకున్నారు చంద్రబాబూ అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ పాదయాత్రలో, షర్మిలమ్మ పాదయాత్రలో ఏమైనా దుర్మార్గాలు జరిగాయా అని చంద్రబాబును నిలదీశారు. ఇలాంటి అడ్డగొలు వాదనలతో ప్రతిపక్ష బాధ్యతను అడ్డుకవడం దుర్మార్గమని మండిపడ్డారు. నాలుగేళ్ల పరిపాలనలో తన కోటరీకి మేలు చేకూర్చేందుకు చంద్రబాబు రహస్యంగా 2 వేల జీవోలను విడుదల చేశారని ధర్మాన మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట ప్రభుత్వమైనా ఇన్ని జీవోలను విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. రహస్యంగా జీఓలను ఎందుకు విడుదల చేశారో చంద్రబాబు కానీ, ఆయన మంత్రులు కానీ చెప్పగలరా అని నిలదీశారు. ప్రజల మేలు కోసం జరుగుతున్న పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్ప యాత్ర సజావుగా సాగాలని ఈ నెల 3వ తేదీన వైయస్‌ జగన్‌ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారని చెప్పారు. 6వ తేదీన ఉదయాన్నే ఇడుపాలపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
Back to Top