వారధిపై జన సారధి

ఇటలీలోని వెనిస్ లా తూర్పు
గోదావరి ప్రాంతం అంతా పారే నదీ ప్రవాహాలు, వాటిపై అందమైన వంతెనలతో కళకళ లాడుతుంటుంది.
జీవకళకు పెట్టింది పేరు తూర్పు గోదావరి జిల్లా. ఎన్ని సమస్యలున్నా గోదారిలా గుంభనంగా ఉండే ఈప్రాంత ప్రజలను ప్రజా సంకల్ప యాత్రలో
పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు వైయస్ జగన్. గోదారి తీరాలలో ప్రజా
సమస్యలను వింటూ కదిలి పోతున్నారు. గోదారి వంతెనలపై ప్రజా ప్రవాహాన్ని
నడిపిస్తున్నారు.

 జన గో’దారులు’

 కింద జలగోదారి, వంతెనపై
జనగోదారి, వర్షించే చినుకుల సవారీ... ప్రజా
సంకల్పం ప్రతి అడుగూ ఓ ఉద్వేగ క్షణంలా సాగుతోంది. ప్రతిపక్షనేత ప్రజా
సంకల్ప యాత్ర గో’దారి’ వంతెనలపై సాగుతుంటే
ఓ నవశకం నడుస్తున్నట్టుగా ఉంటోంది. ప్రజా సంకల్పయాత్ర తూర్పు
గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టడమే ప్రతిష్టాత్మక కొవ్వూరు  రాజమహేంద్రి రైలు రోడ్డు మీదుగా
మొదలైంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిపక్ష నేతకు గోదావరి వాసులు
పలికిన స్వాగతాన్ని రాష్ట్రమంతా ఊపిరిబిగబట్టి చూసింది. ధవళేశ్వరం
ఆనకట్టపై సైతం జననేత ఆగమనం ఓ అద్భుతంలా సాగింది. డొక్కాసీతమ్మ
వారధి, వైనతేయ నదిపై వంతెనలు జన తరంగాలను చవి చూసాయి.
ప్రస్తుతం వైయస్  జగన్ ప్రజా
సంకల్ప పాదయాత్ర రాజోలు, పి.గన్నవరం,
అమలాపురం, మమ్మిడివరం, కొమరగిరి,
యానాం బ్రిడ్జ్ మీదుగా  తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.

 వణుకుతున్న ప్రభుత్వం

 రబీకి నీరులేదు, కొబ్బరిచెట్లతో
ఉన్న కోనసీమకు తాగునీరు కరువు, పెట్రోలు, గ్యాసు అపారమైన ఖనిజ సంపద ఉంది కానీ ప్రజకు ఉద్యోగాలు లేవంటూ గోదావరి వాసుల
మనోవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రజా సంకల్పయాత్రలో జగన్ చేస్తున్న ప్రకటనలు చంద్రబాబు ప్రభుత్వంలో వణుకు
పుట్టిస్తున్నాయి. ఏ వర్గానికైనా వైయస్ జగన్ హామీ ఇచ్చారంటే చాలు,
చంద్రబాబు వెంటనే దాన్ని పూర్తి చేసే పనిలో ఉంటున్నారు. అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని జననేత హామీ ఇవ్వగానే, చంద్రబాబు వారి వేతనాలు పెంచుతూ ఉత్తర్వులిచ్చాడు. అక్వారైతుల
గోడు విని వారికి యూనిట్ విద్యుత్ 1.50కు ఇస్తామని చెప్పగానే,
చంద్రబాబు 2.00 ఇస్తామంటూ ప్రకటించారు.
న్యాయవాదుల సమస్యలపై ప్రతిపక్ష నేత స్పందించిన వెనువెంటనే బాబు మేలుకొని
వారితో సమావేశం ఏర్పాటు చేసి హడావిడిగా కొన్ని వరాలు గుప్పించారు. ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన ప్రతి హామీనీ చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో
అమలు పరచాల్సిన ఒత్తిడికి గురౌతున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ఘనవిజయంలో
ఇది తొలిమెట్టు అనుకుంటున్నారు ఆంధ్రా ప్రజానీకం. ఏళ్లకు ఏళ్లుగా
వినతులు చేసినా పట్టించుకోని ప్రభుత్వంతో ప్రతిపక్ష నాయకుడు, యువనేత వైయస్ జగన్ మెడలు వంచి మరీ పనిచేయిస్తున్నాడని కితాబిస్తున్నారు.

జన నాయకుడికి జేజేలు

జగన్ పాదయాత్రకు అపూర్వ
ఆదరణ లభిస్తోంది.
బహిరంగ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వర్షాలు
పడుతున్నా ఏమాత్రం చెదరక నిలబడుతున్నారు. వైయస్ జగన్ వెళ్లే దారిలో
రహదారికిరువైపులా గంటల తరబడి జననేతను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. తమ ఊరి దాటి వెళ్లినా సరే, మరో ఊరిలో అయినా ఆ నాయకుడిని
కలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ పక్క గ్రామం నుంచి వెళుతున్నాడని
తెలుసుకుని, ర్యాలీగా తరలి వచ్చి  కలుస్తున్నారు.
తమ అభిమాన నాయకునితో కరచాలనం చేసి, సెల్ఫీదిగి,
తమ సమస్యను చెప్పుకుని, ఓదార్పునందుకుని గుండెల
నిండా సంతోషంతో వెనుతిరుగుతున్నారు. ఇంతటి జనాకర్షణ ఆ నాయకుడికి
దక్కిందంటే అది ప్రజల్లో జగన్ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు తార్కాణం. ఈ అపురూపమైన అనుబంధం, పాదయాత్రగా సాగుతూ 200 రోజులను పూర్తి చేసుకుని ముందుకుపోతోంది. 2500 కిలోమీటర్ల
మైలురాయికి చేరువౌతోంది. జన నేతకు జేజేలు పలుకుతూ తూర్పు గోదావరి
జిల్లా జగన్నినాదం చేస్తోంది. 

తాజా వీడియోలు

Back to Top