మహానేత ఆశయాలు ఎప్పటికీ పదిలం

  • చంద్రబాబు రూపంలో ఏపీకి శని పట్టింది
  • రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం
  • వైయస్‌ఆర్‌ సీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి
హైదరాబాద్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు రూపంలో శనిపట్టి పీడిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైయస్‌ఆర్‌ 8వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ చేసిన మంచి పనులు ఇప్పటికీ ప్రజల మదిలో చెరగకుండా ఉన్నాయన్నారు. ఉచిత విద్యుత్, విద్య, వైద్యం ప్రవేశపెట్టిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీటితో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయంటే అది వైయస్‌ఆర్‌ చలవేనన్నారు. రూ.2 కిలో బియ్యం ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి వైయస్‌ఆర్‌ అని కొనియాడారు.

వైయస్‌ జగన్‌ది ప్రజాభిమానం, బాబుది అధికార దుర్వినియోగం
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేని వ్యక్తి ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఓటర్లను బెదిరింపులకు గురిచేసి దొడ్డి దారిన విజయం సాధించాడన్నారు. కాకినాడ, నంద్యాలలో ఓడిపోయామని పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగులుపడాల్సిన అవసరం లేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పుట్టిన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. ఒక్క ఉప ఎన్నికల్లో రూ. 200 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని మనం రాజకీయాల్లో ఇప్పటి వరకు చూసివుండమన్నారు. మహానేత ఆశయాలను బతికించడానికి వారసత్వంగా వైయస్‌ జగన్‌ను మనకిచ్చి స్వర్గస్తులయ్యారన్నారు. వైయస్‌ జగన్‌ది ప్రజాభిమానం, చంద్రబాబుది అధికార దుర్వినియోగమన్నారు.  రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని లక్ష్మి పార్వతి అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top