రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

 
అనంతపురం: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. జూనియర్‌ న్యాయవాదులకు సై్టఫండ్‌ను కూడా పెంచాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు బుధవారం వైయస్‌ జగన్‌ను కలిశారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు న్యాయ‌వాదులు మ‌ద్ద‌తు తెలిపారు . న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు జననేత దృష్టికి తీసుకెళ్లారు. బార్‌ అసోసియేషన్‌అద్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి హయంలో మ్యాచింగ్‌ గ్రాంట్‌ కోటి రూపాయలకు పెంచారని తెలిపారు. చంద్రబాబు వచ్చాక మ్యాచింగ్‌ గ్రాంట్‌ఇవ్వడం లేదన్నారు. ఈ గ్రాంట్‌ను రూ. 5 కోట్ల వరకు పెంచాలని కోరారు. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు కావట్టి శ్రీబాగ్‌ వడంబడికల మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదులకు ఓ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదులకు వెల్‌ఫర్‌ఫండ్, ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేయాలని కోరారు.
 
Back to Top