న్యాయవాదులకు న్యాయం చేస్తాం


తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు సంక్షేమ పథకాలు అందించి న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదులకు సై్టఫండ్, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం ఎస్‌హెచ్‌ వద్ద వైయస్‌ జగన్‌ను న్యాయవాదులు కలిశారు. 2014 ఎన్నికలకు ముందు ఇళ్ల స్థలాలు, డెత్‌ బెనిఫిట్స్‌ మంజూరు వంటి అనేక హామీలను చంద్రబాబు ఇచ్చి మోసం చేశారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ హామీల పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top