వైయస్‌ జగన్‌ను కలిసిన న్యాయవాదులు


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెద్దాపురంలో న్యాయవాదులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులకు రూ.10 వేలు స్టే ఫండ్‌ ఇవ్వాలని జననేతను కోరారు. న్యాయవాదులకు రూ.150 కోట్లతో నిధితో ఏర్పాటు చేయాలని, న్యాయవాదులకు హెల్త్‌ కార్డ్సు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని, ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయని మళ్లీ ఇళ్ల స్థలాలు ఇస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధి కొన్ని పేపర్లలోనే కనిపిస్తుందని, సింగపూర్‌ చేస్తామని చెప్పే వ్యక్తి ఇంతవరకు ఒక్క ఇటుక కూడా అమరావతిలో వేయలేదన్నారు. వైయస్‌ జగన్‌ లాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని, ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రిని చేస్తే..30 ఏళ్లు మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ౖÐð యస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. న్యాయవాదుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చాక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
 
Back to Top