వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే సమస్యల పరిష్కారం

జననేతను కలిసిన జూనియర్‌ న్యాయవాదులు
తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని న్యాయవాదులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూనియర్‌ అడ్వకేట్స్‌కు సై్టఫండ్‌ ఇవ్వడం లేదని, డెత్‌ బెనిఫిట్స్‌ సరిగ్గా లేవన్నారు. అదే విధంగా నోటిఫికేషన్లు చాలా కాలం నుంచి విడుదల చేయడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయవాదులకు ఏ విధమైన సపోర్టు లేదన్నారు. న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ జగన్‌ రూ. వంద కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. నిరుపేదలు, మహిళలు, యువత, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వైయస్‌ జగన్‌ దూరదృష్టితో ఆలోచిస్తున్నారన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు సై్టఫండ్‌ ఇస్తామని ప్రకటించడంతో... న్యాయవాదుల నుంచి అధిక సంఖ్యలో మద్దతు లభిస్తుందన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top