అన్నా..అన్యాయం జ‌రుగుతోంది

 

–  మైనారిటీలు, న్యాయవాదులు, కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘీభావం
–  చంద్రబాబు మోసం చేశాడని విమర్శలు
 అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే జననేత పాదయాత్రకు వస్తున్న స్పందన. దారిపొడువునా ప్రజలు తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైయస్‌జగన్‌ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకున్నారు. మైనారిటీ నాయకులు, కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, న్యాయవాదులు వైయస్‌ జగన్‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్నా..అంటూ కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్స్‌, మైనారిటీలు, న్యాయ‌వాదులు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. మీరొస్తేనే మేలు జరుగుతుందని వైయస్‌ జగన్‌ను కోరుతున్నారు. 

చంద్రబాబు తీరు దారుణం: కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌
కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌పై చంద్రబాబు తీరు దారుణంగా ఉందని ఎస్‌కే యూనివర్సిటీ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ పేరుతో తమకు అన్యాయం చేస్తున్నారని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌కే యూనివర్సిటీకి చెందిన కాంట్రాక్టు లెక్చరర్స్‌ కలిశారు. అన్ని అర్హతలు ఉన్న మమ్మల్ని రోడ్డున పడేశారని మండిపడ్డారు. చంద్రబాబు తీరును క్షమించే పరిస్థితి లేదు అన్నారు. 16 ఏళ్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించకపోవడం దారుణమన్నారు. మమ్మల్ని రెగ్యులరైజ్‌చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ఆమోదం తెలిపిందని, అయితే చంద్రబాబు మా కొంప ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో కూడా రెగ్యులర్‌ చేయాలని కోర్టు అనుమతించిందన్నారు. మేం కూడా హైకోర్టులో పోరాటం చేస్తున్నామని, చంద్రబాబుపై నమ్మకం లేదని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు అన్నారు. 

న్యాయవాదులకు  చట్ట సభల్లో అవకాశం కల్పించాలి
వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో, చట్టసభల్లో తమకు అవకాశం కల్పించాలని వారు ప్రతిపక్ష నేతను కోరారు. అలాగే జూనియర్‌ న్యాయవాదులకు ఇచ్చే సై్టఫండ్‌ను పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

 
Back to Top