లండ‌న్ లో ఘ‌నంగా వైఎస్సార్ జ‌యంతి వేడుక‌లు

హైద‌రాబాద్‌ : దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి వేడుక‌ల్ని ఈ
నెల 19న లండ‌న్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ యూకే, యూర‌ప్ విభాగాల
ఆధ్వ‌ర్యంలో వీటిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ బాల్యం, రాజ‌కీయ
ప్ర‌స్థానం, ప్ర‌జా జీవితాల‌కు సంబంధించిన వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించారు.
పార్టీ సీనియ‌ర్ నేత‌లు అంబ‌టి రాంబాబు, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, గుడివాడ
అమ‌ర్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, ఆదిమూల‌పు
సురేష్‌, కొరుముట్ల శ్రీ‌నివాసులు, ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, యూఎస్ ఎన్నారై
విభాగం క‌న్వీన‌ర్ గుర‌వారెడ్డి త‌దిత‌రులు టెలిఫోన్ ద్వారా అభినంద‌న‌లు
తెలిపి ఉత్తేజ‌ప‌రిచారు. వీడియో ద్వారా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,
పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ సందేశాన్ని వినిపించారు. పార్టీ చేసే
ప్ర‌జా పోరాటాల్ని ప‌ల్లె ప‌ల్లెకు చేర్చే బాధ్య‌త ప్ర‌వాస భార‌తీయుల‌పైన
ఉంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ క్రియాశీల‌కంగా ప‌నిచేస్తున్న సందీప్
వంగ‌ల‌, కిర‌ణ్, పీసీరావు, ప్ర‌దీప్ రెడ్డి, వాసు, శివ‌, స‌తీష్ త‌దిత‌రులు
త‌మ అనుభ‌వాల్ని పంచుకొన్నారు.

Back to Top