బాబు కనుసన్నల్లో భూ కుంభకోణాలు

విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో భూకబ్జాలు జరుగుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భూ అక్రమణలతో విశాఖ పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, ఇంకా సముద్రం తప్పా ఏం మిగలేదన్నారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా మెడ్‌టెక్‌ అంచనా వ్యయాన్ని రూ.2,400 కోట్లకు పెంచారని, మెడ్‌టెక్‌లో అవినీతి జరిగిందని డైరెక్టర్లే ఆరోపిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరికీ ఫిర్యాదు చేశారన్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులను పొట్టనబెట్టుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 

Back to Top