బాబు, లోకేష్ కనుసన్నల్లోనే భూ కుంభకోణం

నెల్లూరు:  చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ కన్నుసన్నల్లోనే సదావర్తి సత్రం భూముల కుంభకోణం జరిగిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.

సదావర్తి సత్రం భూముల వేలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కాకాని డిమాండ్ చేశారు. వైయస్సార్సీపీ నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవడం సబబుకాదన్నారు. ఈ నెల 26న మరోసారి సదావర్తి సత్రం భూముల్లో కమిటీ పర్యటిస్తుందని ఆయన చెప్పారు.

Back to Top