మాఫియాగా తయారై భూములు దోచేస్తున్నారు

విశాఖపట్నంః విశాఖలో జరుగుతుంది మామూలు స్కాం కాదని..ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ దగ్గర్నుంచి రెవెన్యూ అధికారుల వరకు అందరూ కలిసికట్టుగా మాఫియాగా తయారై భూములు దోచుకుంటున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. విశాఖ కలెక్టరేట్ వద్ద టీడీపీ భూ కబ్జాలను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన మహాధర్నాలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపడం కోసం...ప్రభుత్వం మన పట్ల చేస్తున్న మోసాన్ని నిలదీయడం కోసం.... మండుతున్న ఎండను సైతం ఖాతరు చేయకుండా మన బాధను తెలియజేప్పేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ధర్నాతోనైనా బాబుకు కాస్తోకూస్తో బుద్ధి, జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నామన్నారు.  ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై, పేద వాడు పడుతున్న అగచాట్లు రాష్ట్రం యావత్తు తెలిసే విధంగా వాళ్ల నోటి నుంచే విందామని వైయస్ జగన్ స్వయంగా బాధితులతో మాట్లాడించారు..

గణేష్ (ముదుపాక పంచాయతీ గోవిందపురం గ్రామం)
గత సంవత్సరం సరిగ్గా ఇదే జూన్ నెల 2016న మా గ్రామానికి కొందరు భూ దళారీలు వచ్చారు.  ముదుపాకలో మా సర్పంచ్ తో కుమ్మక్కై ...మీ డీ పట్టాల్యాండ్స్ మేం కొనుక్కోవడానికి పైనుంచి అధికారం తెచ్చుకున్నామని చెప్పారు. మీ భూములు మాకు అమ్మకపోతే, ప్రభుత్వం మీకు ఉచితంగా ఇచ్చిన వాటిని లాక్కుంటామన్నారు.మేం పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అడుగుతున్నామనే ఇదంతా చేస్తున్నారు. విత్తనాలు ఇవ్వడంని అడిగితే మా భూములు లాక్కుంటున్నారు. భూములు లాక్కుంటే రైతు ఏమీ అడగడని ఇలా చేస్తున్నారు. మాకు కష్టపడి మీ అందరికీ అన్నం పెట్టడమే తెలుసు. మా చేతిలో అనేక పరికరాలుంటాయి. మమ్మల్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోం. పోరాడుతాం. మా భూములిచ్చేది లేదు. 

వైయస్ జగన్
భూములు లేని ఇక్కడి పేదలు, రైతులకు ప్రభుత్వం 1972, 83, 97లో అసైన్డ్ భూములు ఇచ్చారు. ప్రభుత్వం పేదవాళ్లకు అసైన్డ్ రూపంలో ఇచ్చిన 450 ఎకరాలకు సంబంధించిన ఈ భూమిని కాజేసేందుకు సాక్షాత్తు ప్రభుత్వమే స్కెచ్ వేసింది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది,  మీ భూములు తీసుకోబోతున్నామని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, నాయకులంతా బాబు ఆశీస్సులతో వచ్చి పేద అసైన్డ్ రైతులను బెదరగొట్టి  జీవో తీసుకొచ్చారు. మీ భూములు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నాయమని మరో జీవో ఇష్యూ చేశారు. అయ్యా చంద్రబాబు ఎక్కడైతే పేదవాడు,అసైన్డ్ భూములుంటాయో అక్కడే ల్యాండ్ పూలింగ్ చేస్తారా అని అడుగుతున్నా...? జీవోలిచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కోటరీలు వచ్చి అసైన్డ్ భూములకు ప్రభుత్వం లక్షో, రెండు లక్షలో ఇస్తుంది అంతకన్నా ఎక్కువ ఇవ్వరు...మాకు ఇచ్చేయండి పదిలక్షలు ఇస్తామని చెప్పి...వీరేదో మేలు చేసినట్టుగా పిక్చర్ ఇస్తూ అసైన్డ్ రైతులను బెదరగొట్టి తీసుకునే కార్యక్రమం చేస్తారు. అగ్రిమెంట్లు అయిపోయాక జీవో నంబర్ 304 ఇచ్చి ఈ ఊళ్లో చేస్తున్నామని చెబుతారు. అసైన్డ్ భూములు ఎవరు కొన్నా నేరం. అటువంటిది అగ్రిమెంట్ చేసుకున్నా పర్వాలేదు, కొన్నా పర్వాలేదు..అగ్రిమెంట్ చేసుకునన్న వారికి ల్యాండ్ పూలింగ్ లో భూములిస్తామని జీవోలో మెన్షన్ చేస్తారు.  పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, పేదలను  బెదరగొట్టి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్ పేరుతో కోటి, రెండు కోట్లకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ బినామీలకు అంటగడుతున్నారు. 

రాత్రికి రాత్రే పొలంలో రోడ్లేశారు..
విశాఖ: రూ. 2 కోట్లు విలువ చేసే భూమిని రూ. 10 లక్షలకు ఇమ్మంటున్నారు. మేము భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే మా భూముల్లో రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి రోడ్లు వేశారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. 
– వరలక్ష్మి, మధుపాక 
–––––––––
మాకు న్యాయం చేయండన్నా..
విశాఖ: 300ల సంవత్సరాలుగా 450 ఎకరాల్లో ఊర్లోని రైతులమంతా సాగు చేసుకొని బతుకుతున్నాం.. దానిలో 130 ఎకరాలకు స్థానిక ఎమ్మెల్యే తన బినామీ ఓ రాజు గారిని తీసుకొచ్చి వాళ్ల పేరుతో పాస్‌పుస్తకాలు తయారు చేశారు. ఆ రాజుకు భూమి ఎక్కడుందో తెలియదు.. సరిహద్దులు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అధికారులను నిలదీస్తే ఎకరాకు రూ. 10 లక్షలు మమ్మల్నే ఇవ్వమంటున్నారు. ఇవ్వకపోతే పోలీసులతో కొట్టిసారట. మాకు న్యాయం చేయండి జగనన్న.. ఊరంతా మీకు రుణపడి ఉంటాం.. 
– వెంకట్, చోడవరం నియోజకవర్గం రోలుగుంట్ల మండలం, జేపీ అగ్రహారం

రాక్షసులను వదిలిపెట్టం...
వైయస్‌ జగన్‌: ఒక్క అంగుళం కూడా మీ భూములు పోకుండా తోడుగా ఉంటా.. గట్టిగా పోరాడుదాం.. ఒకవేళ పొరబాటున భూమి తీసుకుంటే ఒక సంవత్సరమే వీరి పాలన, తరువాత వచ్చేది మన పాలన.. ఇవాళ భూములు లాక్కుంటున్న రాక్షసులందరికీ ఒకమాట చెబుతున్నా... అంగుళం అంగుళం కూడా రాబట్టి రైతులకు వెనక్కు ఇప్పిస్తాం.. అంతేకాదు ఈ పనిచేసిన రాక్షసులను జైళ్లకు పంపించే కార్యక్రమం దగ్గరుండి చేస్తాం.. 
–––––––––––––
ఎమ్మెల్యే బినామీలపై చర్చలు లేవు...
విశాఖ: అమలాపురంలో 375 సర్వే నంబర్‌ ఊరకొండ 275 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే బినామీలు, మాజీ సర్పంచ్‌ శ్రీరామచంద్రరావు, మండల నాయకుల ఆధ్వర్యంలో 38 ఎకరాల్లో 50 మంది పేరును రాయించుకున్నారు. స్థానిక వైయస్‌ఆర్‌ సీపీ నేత అండతో గట్టిగా పోరాటం చేస్తే నిజం రుజువైంది.  తాహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు కానీ ఎమ్మెల్యే బినామీలపై ఇప్పటి వరకు చర్యలు లేవు. 
– గోవింద్, పాయకరావుపేట నియోజకవర్గ. నక్కపల్లిమండలం. అమలాపురం
–––––––––––––
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..
విశాఖ: ప్రభుత్వ భూమి ట్యాంపరింగ్‌ జరిగిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు చర్యలు లేవు. లంకెలపాలెంలో 5.7 ఎకరాల ప్రభుత్వ భూమి 2010 వరకు అలాగే వుంది. తరువాత టీడీపీ నేతలు ట్యాంపరింగ్‌ చేశారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తప్పు జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. పైగా నా ఇంటిపై దాడి చేశారు. 
– గోవింద్, గాజువాక పరవాడ మండలం, లంకెలపాలం. 
––––––––––––––
దగ్గరుండి  భూకబ్జాలు చేయిస్తున్న ప్రభుత్వం
విశాఖ: కొత్తనారివారిపాలెం 137 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి 25 ఎకరాల్లో లేఅవుట్‌లు వేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తుంది. ఫిర్యాదు చేస్తే పట్టించుకునేవారు లేరు. జన్మభూమి కమిటీ వారు వచ్చి తోట కొట్టేశారు. అయినా వీరిపై చర్యలు తీసుకునేవారు. పట్టించుకునే అధికారులు 
– శేఖర్, అనకాపల్లి మండలం
తాజా ఫోటోలు

Back to Top