భూ మాఫియాగా బాబు స‌ర్కారు

అమ‌రావ‌తి:  పేద రైతుల పొట్ట‌గొడుతూ కార్పొరేట్ పెద్ద‌ల‌కు భూములు క‌ట్ట‌బెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం భూమాఫి యా అవ‌తార‌మెత్తింద‌ని అఖిల‌ప‌క్ష పార్టీలు, రైతు సంఘాలు ధ్వ‌జ‌మెత్తాయి. భూముల‌పై రైతు యాజ‌మాన్య హ‌క్కును కాల‌రాసేందుకే చీక‌టి జీవో - 271ను తీసుకొచ్చాయ‌ని విరుచుకుప‌డ్డాయి. జీవో 271కు వ్య‌తిరేకంగా విజ‌య‌వాడ‌లో రౌండ్‌టేబుల్ స‌మావేశాన్ని నిర్వ‌హించాయి.

  ఈ సంద‌ర్భంగా వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ మాట్లాడుతూ... జీవో - 271 జారీ చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అతిపెద్ద కుట్ర‌కు తెరతీసింద‌ని ఆరోపించారు. భూమిపై ఉన్న న్యాయ‌మైన హ‌క్కును కాల‌రాయ‌డం ద్వారా రైతుల ఆత్మ‌స్థైర్యాన్ని ప్ర‌భుత్వం దెబ్బ తీ స్తోంద‌న్నారు. రైతుల హ‌క్కులు కాపాడానికి రైతు సంఘాలు తీసుకునే నిర్ణ‌యానికి తాము పూర్తి మ‌ద్ద‌తిచ్చి వెన్నుద‌న్నుగా ఉంటామ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పార‌ని బోస్ తెలిపారు. అనంత‌రం మాజీ మంత్రి వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌రరావు మాట్లాడుతూ... అభివృధ్ధి పేరిట అవ‌స‌రానికి మించి భూముల‌ను రైతుల నుంచి బ‌ల‌వంతంగా గుంజుకుని కార్పొరేట్ సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌ట‌మే ప్ర‌భుత్వం విధానంగా మారింద‌న్నారు.

తాజా వీడియోలు

Back to Top