భూ స‌మీక‌ర‌ణ కు నోటిఫికేష‌న్ జారీ

గుంటూరు: రాజ‌ధాని ప్రాంతంలో బ‌లవంతంగా భూముల్ని లాక్కొనేందుకు ప్ర‌భుత్వం మ‌రిన్ని కుట్ర‌ల‌కు తెర‌దీసింది. 10 గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణ కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ కాంతీలాల్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. రేపు మ‌రో 19 గ్రామాల్లో భూ స‌మీక‌ర‌ణ నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. భూ సేక‌ర‌ణ కు అంగీక‌రించక పోతే, భూ  స‌మీక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌భుత్వం కొంత కాలంగా బెదిరిస్తూ వ‌స్తోంది. అన్న‌ట్లుగానే భూముల్ని లాక్కొనేందుకు ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప్ర‌తిపక్ష వైఎస్సార్ సీపీ స‌హా ఇత‌ర విపక్షాలు, రైతు సంఘాలు ముక్త‌కంఠంతో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల్ని వ్య‌తిరేకిస్తున్నాయి.

తాజా ఫోటోలు

Back to Top