లక్ష మందితో షర్మిలకు స్వాగతం

మందమర్రి:

మరో ప్రజాప్రస్థానం లో భాగంగా తెలంగాణలో ఈ  నెల 22న అడుగుపెడుతున్న షర్మిలకు లక్ష మందితో స్వాగతం పలకనున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ కాంపెల్లి సమ్మయ్య చెప్పారు.  స్వాగతం చెప్పేందుకు సింగరేణి కార్మికులు భారీ ఎత్తున తరలనున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్, తెస్తామ ని కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని, ప్రజలను మరిచిన కేసీఆర్ ఇప్పుడు వంద ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్లు కావాలని ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాదయాత్రను కాంగ్రెస్ పరిరక్షణ యాత్రగా అభివర్ణించారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేం దుకే పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Back to Top