లక్సెట్టిపేటలో దీక్ష విరమించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్

ఆదిలాబాద్, 8 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, కరెంటు కోతల‌కు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటలో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం విరమించారు. పార్టీ మంచిర్యాల నియోజకవర్గం సమన్వయకర్త బి. జనక్‌ ప్రసాద్ ఆధ్వర్యంలో ‌వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు లక్సెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద రెండు రోజులుగా నిరాహార దీక్ష ‌చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ ఎం.పి. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Back to Top