చంద్రబాబుపై మహిళల ఆగ్రహం

రాష్ట్రంలోని మహిళలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దాడులు, మాన ప్రాణాలు దోచుకుంటున్న విధానంపై ప్రశ్నించినందుకు..మహిళా ఎమ్మెల్యేను కూడా చంద్రబాబు పోలీసులతో దాడి చేయించారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వం మరొకటి ఉండదని ప్రజలు, మహిళాసంఘాలు మండిపడుతున్నారు. ఇక ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటే సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గూండాలు, పోలీసులతో పేద మహిళలు, మహిళా అధికారిణిలు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేయిస్తున్న దాడుల పట్ల సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారమందంతో పచ్చచొక్కాలు సాగిస్తున్న అరాచకాలపై రాష్ట్ర ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. మహిళలపై  అమానుషంగా దౌర్జన్యాలకు దిగుతున్న  చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని...రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Back to Top