హామీలపై లోకేష్ ను నిలదీసిన మహిళలు

చోడవరం(విశాఖ) : ఎన్నికల హామీలు నెరవేర్చకుండా జనచైతన్యయాత్రల పేరుతో ఊళ్లు తిరుగుతున్న టీడీపీ నేతలను ప్రజలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌బాబుకు మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్‌ను మహిళలు అడ్డుకున్నారు. హుద్‌హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందించలేదంటూ లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు కాలేదని, అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదని లోకేష్ ను నిలదీశారు. దీంతో, ఏం సమాధానం చెప్పాలో తెలియక చినబాబు బిత్తరపోయారు.

Back to Top