గిట్టుబాటు లేక కార్మికుల అవస్థలు

అసెంబ్లీః చేనేత, గీత, వృత్తి కార్మికులు  విద్యుత్ కోతలు, ముడిసరుకు ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పెరిగిన ధరలతో గిట్టుబాటు కాక కార్మికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవన విధానం సరిగా లేని ఎస్సీ,ఎస్టీలు రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నారని, వారంతా  కూలీపైనే ఆధారపడి ఉన్నారని శ్రీనివాసులు పేర్కొన్నారు. 60 సంవత్సరాలు వచ్చినా కూడా కూలీ పనులు చేయడం వల్ల బక్కచిక్కే పరిస్థితి ఉంది గనుక ...వారి వయస్సు 50 సంవత్సరాలకు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించారు.

Back to Top