నేపాల్ బాధితులకు కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం

కువైట్: జన నేత వై.యస్. జగన్ గారి పిలుపు మేరకు కువైట్ జైంట్ కో ఆర్డినేటర్ యం. బాలిరెడ్డి గారి సలహాలతో యం.వి. నరసా రెడ్డి గారి ఆధ్వర్యములో సభ్యులు గోవింద్ నాగరాజు, నాయని మహేష్, పి.రేహామాన్ ఖాన్, యం. చంద్రశేఖర్  రెడ్డి, ఆకుల ప్రభాకర్, తెట్టు రఫీ, సి. చంద్రశేఖర్ రెడ్డి, కె. సురేంద్ర రెడ్డి, రమణ యాదవ్, నాగిరెడ్డి చంద్ర. మర్రి కళ్యాణ్, పి. సురేష్ బాబు, దుగ్గి గంగాధర్, యం. సుబ్బారెడ్డి, సజ్జద్, గారి సహాయ సహకారాలతో నేపాల్ భూకంప భాదితుల సహాయార్ధం  బట్టలు, పాల డబ్బాలు, దుప్పట్లు, మినీ లారి లో మొదటి విడతగా నేపాల్ అంబాసి సూచించిన నేపాల్ స్వక్షంద సంస్ధ సభ్యులకు ఇవ్వడం జరిగిందని కువైట్ కో అర్డినేటర్ ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భముగా యం. బాలిరెడ్డి గారు నరసారెడ్డి, కమిటి సభ్యులను అభినందిస్తూ భారత దేశంలో పకృతి వైపరీత్యాల ద్వారా జరిగే భూకంప భాదితులకు, తుఫాన్ భాదితులకు మంచి మనసుతో ఆదుకోవడం కువైట్ కమిటి సభ్యుల మంచి తనానికి నిదర్శనమన్నారు. మన దేశమే కాకా మిత్ర దేశమైన నేపాల్ లో జరిగిన భూకంప భాదితులను ఆదుకోవాలని అలోచించి మొదటి విడతగా బట్టలు, పాల డబ్బాలు, దుప్పట్లు భారి ఎత్తున సేకరించి భాదితులకు అందేల చేయడం నిజంగా అభినందనీయమని ఇందుకు సహాకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో కడప శీను, పాటూరు వాసు, బి. శివారెడ్డి, డి. గోపాల్ రెడ్డి, షేక్ నాసర్, యు. శివాకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, కె. రవి రెడ్డి, నేపాల్ స్వక్షంద సంస్ధ సభ్యులు పాల్గోన్నారు. 
Back to Top