కువైట్‌లో సేవ్‌ డెమోక్రసీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ కువైట్‌ దేశంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సేవ్‌ డెమోక్రసీ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్న గల్ఫ్‌ దేశంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ..వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి అనైతికంగా తీసుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం దారుణమన్నారు. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని వారు సవాల్‌ విసిరారు. కార్య‌క్ర‌మంలో కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి నరసారెడ్డి, ట్రేజరర్ నాయని మహేష్ రెడ్డి, ఆకుల చలపతి, షేక్ కలామ్, యూత్ టీం ఇంచార్జీ, మర్రి కళ్యాణ్, యూత్  నాయకులు సయ్యద్ సజ్జాద్, రఫీక్ ఖాన్, షేక్ సర్దార్, రావురి రమణ, హనుమంత్ రెడ్డి, కల్లూరి వాసు, బి.యన్.సింహ రెడ్డి, ఓబులపు మోహన్ రెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, గోవిందు రాజు, శివ బాల, రవి శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top