ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు

 
వైజాగ్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటు అని వైయస్‌ఆర్‌సీపీ కురుపం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. పార్టీ ఫిరాయించిన సర్వేశ్వరరావుకు విప్‌ పదవి ఇవ్వడం పట్ల పుష్పశ్రీవాణి తప్పుపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచి టీడీపీ కండువా∙కప్పుకున్న సర్వేశ్వరరావుకు విప్‌ పదవి కట్టబెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు.  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు పూలదండలు వేయడం, జయంతి ఉత్సవాలు నిర్వహించడం నిజమైన నివాళి కాదని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించడమే నిజమైన నివాళి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. అలాగే సర్వేశ్వరరావుకు విప్‌ పదవి కట్టబెట్టడం సరైన విధానం కాదన్నారు.
 
Back to Top