సీమపై చంద్రబాబు చిన్నచూపు

కర్నూలుః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలులో విస్తృతంగా పర్యటించారు. రోడ్లు తదితర సమస్యల దృష్ట్యా నగరంలో కలియ తిరిగారు. కర్నూలు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉందని మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నగర సమస్యలను పట్టించుకోవడం లేదని మోహన్ రెడ్డి మండిపడ్డారు. మహానేత వైఎస్.  రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వాల్ కు తుంగభద్ర, హంద్రీనదికి రూ.243 కోట్లు కేటాయిస్తే... పనులు మొదలు పెట్టకపోవడంతో అది రద్దయిపోయిందన్నారు.

రాయలసీమ పట్ల చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి పైరయ్యారు. ఎంతసేపు రాజధాని ప్రాంతమే తప్ప వెనుకబడిన జిల్లాలను పట్టించుకోవడం లేదన్నారు. కేవలం అమరావతిలో కట్టే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. అలా చేస్తే వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడా కూడా పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. సీమ జిల్లాలు ఎడారి అయిపోయి.... చదువుకునే పిల్లలు అసాంఘిక శక్తులుగా  మారే ప్రమాదం ఉందన్నారు. అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 

ఆలూరు  నియోజకవర్గంలోని రైతులను ఆదుకోవాలని ఎస్సార్సీపీ ఎమ్మెల్యే జయరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలూరు పరిధిలోని ఆరు మండలాల్లో కేంద్ర కరవు బృందం తనిఖీలు చేసిందన్నారు. అక్కడ దాదాపు లక్షా 24వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారన్నారు. కరవుతో గ్రామాలకు గ్రామాలు వదిలిపోయే పరిస్థితి ఉందని అన్నారు. గతంలో కూడా నాలుగు కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం, ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు.  ఈసారైనా రైతులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Back to Top