సోమ‌యాజుల‌కు నివాళి

 

క‌ర్నూలు: వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతికి పార్టీ నాయ‌కులు నివాళుల‌ర్పించారు. 
 కర్నూలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య , కర్నూలు జిల్లా నాయకుడు, రిటైర్డు ఐజి మహ్మద్ఇ క్బాల్ , వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేంద్రరెడ్డి , నాయ‌కులు భాస్కర్ రెడ్డి,  కరుణాకర్ రెడ్డి, దనుంజయ ఆచారి త‌దిత‌రులు సోమ‌యాజులు చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీకి చేసిన సేవ‌ల‌ను  నాయ‌కులు కొనియాడారు. 
Back to Top