న్యాయం జరిగే వరకు పోరాడుతాం

కర్నూలుః వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా నేతలు రైతు సమస్యలపై ఇవాళ
కలెక్టర్ ను కలిశారు. ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో మోసపూరితంగా
వ్యవహరిస్తుందని వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ
లేనంతగా కర్నూలు జిల్లాలో కరువు నెలకొందని...జిల్లా అంతటినీ కరువు
మండలాలుగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోకి వెళ్లి
రైతులు, రైతు సంఘాల ద్వారా కరువుకు సంబంధించిన వాస్తవ విషయాలు
తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

రైతులను
ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు
వ్యవహరిస్తున్నాయని ఈసందర్భంగా నేతలు మండిపడ్డారు. రైతులకు భరోసా ఇవ్వడంలో
ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కృష్ణా ,గోదావరికి సంబంధించిన
రూల్స్ రాయలసీమకు అప్లై చేయడం సరికాదని నేతలు చంద్రబాబుకు హితవు పలికారు.
గతంలో కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం... ఇంతవరకు వారికి ఇన్ పుట్
సబ్సిడీ అందించిన దాఖలాలు లేవన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు
వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 
Back to Top