వైయస్సార్సీపీలో చేరిన కర్నూలు జిల్లా నేతలు

క‌ర్నూలు:  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాట‌సాని రాంభూపాల్ రెడ్డి వ‌ర్గానికి చెందిన 50మంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి బీవై రామ‌య్య స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాట‌సాని వ‌ర్గీయుల‌ను గౌరు వెంకట్ రెడ్డి తన నివాసంలో కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

గ‌ణేష్‌న‌గ‌ర్‌, టెలికాంన‌గ‌ర్‌కు చెందిన కాట‌సారి వ‌ర్గీయుల‌తో పాటు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా చైర్మ‌న్ భాస్క‌ర్‌రెడ్డి, పివి శేఖ‌ర్‌, పి. శ్రీ‌నివాసులు, కె. మ‌ద్దిలేటి, ఈశ్వ‌ర‌య్య‌, సూరి, ప్ర‌భుత్వ రిటైర్డ్ ఉద్యోగి బాల సుంద‌రం, ల‌క్ష్మ‌ణ్‌నాయ‌క్‌తో పాటు మరో 50 మంది వైయ‌స్సార్‌సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా గౌరు వెంక‌ట‌రెడ్డి, ఎమ్మెల్యే చ‌రిత‌ారెడ్డి, బీవై రామ‌య్య‌ను పూల‌మాల‌తో స‌న్మానించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top