కుప్పం నుంచే మన గెలుపు ప్రారంభం కావాలి

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 52వ రోజు పెద్దూరు గ్రామంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కుప్పం నియోజకవర్గ ప్రజలు కలిసి మద్దతు తెలిపారు.  బీసీలను సులువుగా మోసం చేయవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. బీసీలకు ఏం చేశారని చంద్రబాబును నిలదీయాలని సూచించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు. 
కుప్పంలో  వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చంద్ర‌మౌలిని గెలిపిస్తే కేబినెట్‌లో కూర్చొబెట్టి చంద్ర‌బాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తాన‌న్నారు. బ‌స్సు యాత్ర‌లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తాన‌ని, అన్ని మండ‌లాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని కుప్పం ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top