వైయస్‌ జగన్‌ సీఎం అయితే మేలు


నెల్లూరు: వైయస్‌ జగన్‌ సీఎంఅయితేనే మంచి జరుగుతుందని రాష్ట్రపతి అవార్డు గ్రహిత కూన మల్లికార్జన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తేనే మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. వయస్సైన చేనేతల కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తే ఆసరాగా ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వాలు వచ్చిన తరువాత జీఎస్‌టీ వచ్చిందని, ఈ జీఎస్టీతో చేనేతల కడుపు కొట్టారనిఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్‌టీలను చేనేతలకు వర్తించకుండా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఇల్లు, లక్ష రూపాయల వర్క్‌ షెడ్‌ ఏర్పాటు చేయాలని కోరారు.
 
Back to Top