కుమ్మ‌రుల‌కు తోడుగా ఉంటా
నెల్లూరు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌ కుమ్మ‌రుల‌కు తోడుగా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధ‌వారం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ను కుమ్మ‌రులు క‌లిసి త‌మ కష్టాలు వివరించారు. రాష్ట్రంలో కుమ్మరులు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నామ‌ని చెప్పారు. విద్యాపరంగా ఎదగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. రాజకీయంగా సైతం వెనుకబడి ఉన్నారని చ‌ట్ట స‌భ‌ల్లో కుమ్మ‌రుల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..మీ పిల్ల‌ల‌ను ఏ చ‌దువులైనా చ‌దివించండి..తాను ఎన్ని ల‌క్ష‌లైనా భ‌రిస్తాన‌ని, అంతేకాకుండా హాస్ట‌ల్ ఫీజుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాన‌ని, చిన్న పిల్ల‌ల‌ను బ‌డికి పంపించినందుకు త‌ల్లి ఖాతాలో రూ.15 వేలు జ‌మా చేస్తామ‌న్నారు. 45 ఏళ్ల‌కే పింఛ‌న్లు ఇస్తామ‌ని,  వైద్యం కో్సం ఏ ఒక్క‌రూ అప్పుల‌పాలు కాకుండా చూస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మాట ఇచ్చారు. జ‌న‌నేత హామీతో కుమ్మ‌రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
Back to Top