కుమ్మక్కు రాజకీయాలవల్లే బెయిల్ నిరాకరణ

ఇడుపులపాయ (వైయస్ఆర్ జిల్లా):

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాల వల్లే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డికి బెయిల్ రావడంలేదని ఆ పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి గత కొన్ని నెలలుగా జైలులో ఉండటం కుటుంబాన్ని కలచివేస్తోందన్నారు. ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్బంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైయస్ వివేకానందరెడ్డినివాళులర్పించారు.

Back to Top