'కృష్ణా నీరు అందని పాపం బాబుదే

పులివెందుల, 23 మే 2013:

ప్రజల కష్టాలు తెలియని ప్రభుత్వాలివని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందకపోవడం వెనుక పాపం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుదేనని ఆమె ఆరోపించారు.  ఆల్మట్టి డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయించాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గరు  ఎన్నిసార్లు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చంద్రబాబు కాపాడుతున్నారని  శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరిని ఉద్ధరించడానికి రైతు చైతన్యయాత్రలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు 300శాతం పెంచారనీ, ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నారనీ విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని శ్రీమతి విజయమ్మ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top