కృష్ణా రివ‌ర్ అథారిటీ ఏర్పాటు చేయాలి

విజ‌య‌వాడ‌) నీటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృష్ణా జలాల వినియోగం దిశ‌గా రివ‌ర్ అథారిటీ ఏర్పాటు చేయాల‌ని వైయ‌స్సార్సీపీ రైతు విభాగం అధ్య‌క్షులు ఎమ్ నాగిరెడ్డి అభిప్రాయ ప‌డ్డారు. కృష్ణా జిల్లా ఘంట‌సాల మండ‌లం కొడాలి లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రివ‌ర్ అథారిటీ ద్వారా ప్రాజెక్టుల్ని ఎంచివేసి నాలుగు రాష్ట్రాల్లో నీటి పంపిణీ చేయాల‌ని ఆయ‌న సూచించారు. అప్పుడే జ‌లాల వినియోగం విష‌యంలో స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని నాగిరెడ్డి వివ‌రించారు. లేదంటే జ‌లాల వినియోగంలో అంత‌ర్ రాష్ట్ర యుద్ధాలు వ‌స్తాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.


To read this article in English:  http://bit.ly/1qfdPvd 

Back to Top