భూముల జోలికొస్తే ఖబడ్దార్..!

కృష్ణాః పచ్చసర్కార్ భూదోపిడీపై రైతన్నలు కన్నెర్ర జేశారు.  కృష్ణాజిల్లాలో మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. కుర్చీలు తగలబెట్టి   తమ నిరసనను తెలిపారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 

రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొంటూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా కొనసాగిస్తోంది. భూములివ్వని రైతులపై బెదిరింపులకు పాల్పడుతూ నరకయాతనకు గురిచేస్తోంది. 
Back to Top