వైయస్‌ జగన్‌ను కలిసిన కౌశిక తల్లిదండ్రులు


డోన్‌: ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యం వల్ల తమ కుమార్తె కౌశిక ట్రిపుల్‌ ఐటీలో సీటు కోల్పోయిందని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. దాదాపు 9.5 పర్సంటేజ్‌ వచ్చినాక రీవెరిఫికేషన్‌ పెట్టుకుంటే మూడు మార్కులు పెరిగాయని, గ్రేడ్‌ మారకపోవడంతో అన్యాయం జరిగిందని జననేతకు వారి గోడు వెల్లబోసుకున్నారు. అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.
మా పాపకు సీటు కావాలి...
వైయస్‌ జగన్‌కు తమ గోడు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామం నుంచి ప్రజా సంకల్పయాత్రకు వచ్చాం. మా పాపకు ఎస్‌ఎస్‌సీలో 2017లో 9.5 పర్సంటేజ్‌ వచ్చింది. రీవెరిఫికేషన్‌ పెట్టుకుంటే మూడు మార్కులు పెరిగినా గ్రేడ్‌ మాత్రం పెరగలేదు. మండల టాపర్‌ అయినా ఇంత అన్యాయం జరిగింది. వెంటనే ఇడుపుల పాయకు వెళ్లి కలుస్తే అడ్మీషన్‌లు పూర్తయ్యాయి అని చెప్పారు. తరువాత తాడేపల్లిలో వీసీని కలిస్తే కమిషనర్‌ నుంచి లెటర్‌ తీసుకురమ్మన్నారు. కమిషనర్‌ను కలిస్తే లెటర్‌ ఇచ్చారు. కానీ త్రిపుల్‌ ఐటీలో లెటర్‌ బేస్‌ చేసుకొని సీటు ఇవ్వలేమంటున్నారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యంతో మా పాప చదువుకు ఆటంకం కలిగింది. వైయస్‌ జగన్‌ను కలవడంతో ఆయన మాకు భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే విధంగా చూస్తానని ధైర్యం చెప్పారన్నారు. 
Back to Top