ఒంగోలుః వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇవాళ ఒంగోలులో ప్రధానమంత్రి కౌశల్య వికాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఏపీలో మొట్టమొదటి డీఎంకేఈవై ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ను జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వచ్చే రెండేళ్లలో కనీసం 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం లక్షంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు . ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. <br/> గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐటీ కంపెనీలు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమానికి ముందుకు వచ్చాయని సుబ్బారెడ్డి తెలిపారు. దీంట్లో చేరిన ప్రతి ఒక్కరికీ క్వాలిఫికేషన్, ఎక్స్ పీరియన్స్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో చేరిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రభుత్వమే ఖర్చంతా భరిస్తుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వారు సెలక్ట్ చేసుకున్న కోర్స్ ను బట్టి నెలకు 7500 నుంచి రూ.12 వేల వరకు ప్రభుత్వం చెల్లింస్తుందన్నారు. ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాక ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఐటీ కంపెనీస్ లలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. <br/>ఈకార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఒంగోలులో ప్రారంభించబడిందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈఅవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, కంబైన్డ్ జాబ్ మేళ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని సుబ్బారెడ్డి ప్రకటించారు. ఏఫ్రిల్ లో పెద్ద ఎత్తున జాబ్ మేళ జరిగిందని, సుమారు 1200మందికి ఉద్యోగాలు ఇప్పించామన్నారు. మిగతా వారికి స్కిల్స్ లేనందునే ఉద్యోగాలు దక్కించుకోలేక పోయారనన్నారు. అందుకనుగుణంగానే కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకునేందుకు ఈకార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.