దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారు..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు తగ్గుతుంటే..చంద్రబాబు మాత్రం పెద్ద ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. తన సదుపాయాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టే చంద్రబాబు...సామాన్యుడు తిరిగే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం ఎంతవరకు సబబని నిలదీశారు. నిత్యవసర ధరలు భగ్గుమంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.

కందిపప్పు, మినపపప్పు ధరలు రూ.200 పైన ఉన్నాయంటే..రాష్ట్రప్రభుత్వం పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని సుబ్బారాయుడు పైరయ్యారు. ధరలు మండిపోతుంటే చంద్రబాబు కళ్లు అప్పగించి చూస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగనివ్వనని చెప్పిన చంద్రబాబు...వాటిని నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యాడని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు.
Back to Top