కంపెనీల పేరుతో మా భూములు లాక్కుంటున్నారు


తూర్పు గోదావరి: కంపెనీల పేరుతో మా భూములు లాక్కుంటున్నారని కొత్త వెలమ పేట వాసులు వాపోయారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ను కొత్త వెలమపేట వాసులు కలిశారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న 500 ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 72 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను కంపెనీల పేరుతో ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. భూములు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పారు. తమ భూములు తమకు ఇప్పించాలని వారు కోరారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల భూములు ఆక్రమించుకోవడం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం పరిపాటిగా మారిందని వైయస్‌ జగన్‌కు చెప్పారు. వారి సమస్యలను సావధానంగా విన్న జననేత..మన ప్రభుత్వం వచ్చాక ఎవరి భూములు వారికి ఇప్పించే కార్యక్రమం చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top