పార్టీ నేతలకు కొఠారు పరామర్శ

గోపన్నపాలెం(దెందులూరు)మండలంలో అనారోగ్యానికి గురైన వైయస్సార్‌సిపి నేతలను  పార్టీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌ , జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పరామర్శించారు. గోపన్నపాలెంలో మండల కాపు సంఘం మాజీ కన్వీనర్, గ్రామ వైయస్సార్‌సిపి నేత కొండేటి నాగేశ్వరరావు, కొత్తపల్లిలో వీరంకి లక్ష్మీనారాయణ, సోమవరప్పాడులో చల్లపల్లి నాగేంద్రలను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైయస్సార్‌సిపి నాయకులు తోట పద్మారావు, చల్లగుళ్ల తేజ, బి జమలయ్య, చల్లారి గోపి ఉన్నారు. 
 
Back to Top