ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో ఎన్నిక‌ల‌కు సిద్ధం

నెల్లూరు రూర‌ల్ః

 ప్ర‌జ‌ల దీవెల‌న‌ల‌తో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కురుక్షేత్ర మ‌హా సంగ్రామానికి వైయ‌స్ఆర్ సీపీ సిద్ధంగా ఉంద‌ని నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని మ‌హానేత వైయస్ రాజ‌శేఖ‌రెడ్డి బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌లు చేయ‌బోయేది చెబుతూ.. న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. అదే విధంగా రాజ‌న్న‌కు గుర్తుగా.. జ‌గ‌నన్న‌కు తోడుగా ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబం అనే కార్య‌క్ర‌మాన్ని లాంచ‌నంగా ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. నీల‌గిరి సంగంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ప్ర‌జ‌లంతా వైయ‌స్ఆర్ కుటుంబంలో భాగ‌స్వాములై మోస‌కారి టీడీపీ పార్టీని త‌రిమికొట్టాల‌ని విమ‌ర్శించారు.

Back to Top