అగ్రిగోల్డ్‌పై చర్చ అంటే ఎందుకంత భయం

ఏపీ అసెంబ్లీ : అగ్రిగోల్డ్‌పై చర్చ అంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతోమాట్లాడారు. సీఎం మాత్రం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతున్నారు. అగ్రిగోల్డు బాధితులు, ఏజెంట్లు మూడేళ్లుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని పట్టుపడితే ప్రభుత్వం పారిపోయిందన్నారు. 20 నిమిషాల పాటు అధికార పక్షానికి మైక్‌లు ఇచ్చి వైయస్‌ జగన్‌ను తిట్టించారని, ఆ సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై చర్చించి ఉంటే వారికి న్యాయం జరిగేదన్నారు. ప్రతిపక్ష నేత 30 లక్షల మందికి సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. ఇన్నాళ్లు దీక్ష శిబిరాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. బాధితుల ఉద్యమాన్ని నీరుగార్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఓ ప్రభుత్వమా అగ్రిగోల్డుపై చర్చ అంటే ఎందుకంత భయం. మీ పార్టీ నాయకుల భాగస్వామ్యం అందులో ఉందా అని నిలదీశారు. లోకేష్‌ హస్తం లేకుంటే ఎందుకు చర్చకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా అగ్రిగోల్డు యాజమాన్యానికి ఈ ప్రభుత్వం కొమ్ముకాయకుంటే రండి చర్చిద్దాం. వారి మెడలు వంచి బాధితులకు న్యాయం చేద్దాం.

Back to Top