సమస్యలు తీర్చండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ
ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పేదల ఇళ్ల సమస్యలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేవనెత్తారు. పేదల ఇళ్ల
నిర్మాణంలో సౌకర్యాలు లేవని   శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే
చాలా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని
భావించినా కనీసం రూ.50కోట్ల నిధులు ఇస్తే పేదలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.తాము కోరినట్లు నిధులిచ్చి పేదలకు మేలుచేయాలని కోరారు.
ఇప్పటికే జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని మంత్రి కూడా
ఒప్పుకున్నారని, ఈ సమస్యను కూడా దృష్టిలోకి
తీసుకోవాలన్నారు. మంచి నీటి కొరత కూడా అధికంగా ఉందని దాన్ని కూడా తీర్చాలని కోరారు.

Back to Top