నంద్యాల దెబ్బకు బాబు అబ్బా అనాలి

  • బాబు పతనం నంద్యాలనుంచే ప్రారంభమవ్వాలి
  • అన్ని వర్గాల ప్రజలను వంచించాడు
  • బాబుకు నంద్యాల ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలి
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నంద్యాలః చంద్రబాబు పతనం నంద్యాలనుంచే ప్రారంభం కావాలని...బాబుకు తగిన గుణపాఠం చెప్పాలని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘనవిజయానికి నంద్యాల విజయంతోనే అడుగుపడాలన్నారు. వైయస్ జగన్ శంఖారావం..బాబు పతనం నంద్యాల నుంచే ప్రారంభమైందని చెప్పుకునేవిధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. బెదిరించి, దబాయించి ఓట్లు వేయించుకోవాలని  ప్రయత్నించిన బాబుకు నంద్యాల ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు.  నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బ అనేలా తీర్పు ఇవ్వాలన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడలేని చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నాడని కోటం రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారముందని నంద్యాలను బయపెట్టి గెలవాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. మరింతగా చరిత్రలో దిగజారిపోతావని,  హిట్లర్ కు పట్టిన గతే నీకు పడుతుందని చంద్రబాబును హెచ్చరించారు. వందల కోట్ల డబ్బు ఓ పక్క...నంద్యాల ప్రజల ఆత్మగౌరవం మరోపక్క అని కోటంరెడ్డి అన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పారో ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరినీ మోసం చేశార్నారు.

రాష్ట్రమంతా నంద్యాల తీర్పు కోసం  వేచిచూస్తోందన్నారు. బాబుకు తగిన గుణపాఠం చెప్పేందుకు సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నంద్యాల ప్రజలు అధృష్టవంతులని,  రెండేళ్ల ముందే చంద్రబాబు దొరికాడన్నారు. మైనారిటీలను రాజకీయంగా ఎంతగా అవమానించాడో చూశామన్నారు. క్యాబినెట్ లో ముస్లిం లేని వ్యక్తి ఏపీలోనే చూస్తున్నామన్నారు.   కాపులను దుర్మార్గంగా వంచిచాడన్నారు. 
Back to Top