వైయస్సార్సీపీలో చేరిన కోటగిరి శ్రీధర్

  • ద్వారకాతిరుమలకు పోటెత్తిన ప్రజలు
  • వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రీధర్
  • బాబు మోసాలపై పోరాటం చేద్దామని నేతల పిలుపు
పశ్చిమగోదావరిః  జిల్లాలోని ద్వారకాతిరుమలలో వైయస్సార్సీపీ నిర్వహించిన భారీ బహిరంగసభకు జనం పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పశ్చిమ జనం మధ్య వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో కోటగిరి శ్రీధర్ పార్టీలో చేరారు. వైయస్ జగన్ శ్రీధర్ కు పార్టీ కండువా కప్పి స్వయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ మోసపూరిత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

ఆళ్ల నాని(పార్టీ జిల్లా అధ్యక్షుడు)
ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికి తెలుసు..పశ్చిమ గోదావరి జిల్లాకు ఎన్నో సేవలు అందించిన కోటగిరి విధ్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ జిల్లాకు ఎప్పుడు వైయస్‌ జగన్‌ అండగా నిలబడుతున్నారు. ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న విధానాన్ని రాష్ట్రానికి చూపించారు. యుద్ధం ప్రకటిస్తే దానికి భయపడి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పరిహారం పెంచారంటే అది వైయస్‌ జగన్‌ ఘనతే. జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఈ జిల్లా రుణం తీర్చుకుంటానని చెప్పారు. యువభేరికి వచ్చినప్పుడు మనమందరం కూడా విజయవంతం చేశాం. యువత ముందుకు వచ్చి పోరాటంలో భాగస్వామ్యమయ్యారు. తుందుర్రు ప్రాంతంలో కూడా వైయస్‌ జగన్‌ వచ్చాకే న్యాయం జరిగింది. ఆయా ప్రాంతాలకు సంభందించిన ప్రజల ఆరోగ్య సమస్యలపై పోరాటం చేశారు. మళ్లీ ఈనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం శ్రమిస్తూ..హోదా పోరాటంలో మనల్ని చైతన్యవంతం చేసేందుకు వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్నాం.

–––––––––––––
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌( పార్టీ జిల్లా ఇంచార్జ్)
నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడానికి మన నాయకుడు వెళ్లినప్పుడు ఈ ప్రభుత్వం అడ్డుకోగలిగింది కానీ..ప్రజానీకం అండగా నిలిచారు. ఈ ఉద్యమానికి మేం మద్దతిస్తామని ఇంతమంది రావడం సంతోషకరం. గత ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు నూటికి నూరు శాతం టీడీపీ సభ్యులను ఎన్నుకొని మద్దతు ప్రకటించారు. ఈ మూడు సంవత్సరాల్లో అగ్రపీఠం వేయాల్సిన ప్రభుత్వం కనీసం లెక్క చేయడం లేదు. పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేశారు. ప్రతి గ్రామంలో కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు మీకు అధికారం ఇస్తే..మీరు విస్మరిస్తారా? కోటగిరి శ్రీధర్‌ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలి. చంద్రబాబు మోసాలపై పోరాటం చేద్దాం. ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వెనుకబడిన కులాలకు 110 హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయడం లేదు. ఎందుకు మీ వెనుకాల వెనుకబడిన కులాలు నిలబడాలి. బాబు ఇచ్చిన వాగ్ధానాలు తుంగలో తొక్కిన కారణంగా ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ఈ రోజు ప్రజలు ఈ సభకు హాజరయ్యారని పేర్కొన్నారు.
 
Back to Top